CM Akhilesh Yadav :అక్రమ మైనింగ్ కేసులో అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు

అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు పంపింది. 160 సీఆర్‌పీసీ కింద ఈ సమన్లు జారీ చేశారు. 2012 నుంచి 2016 మధ్య కాలంలో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ అక్రమ మైనింగ్ జరిగింది. ఫిబ్రవరి 29న అఖిలేష్ యాదవ్‌ను సాక్షిగా పిలుస్తూ సీబీఐ ఈ కేసులో సమన్లు పంపింది.
2012-2016 మధ్య కాలంలో జిల్లా హమీర్‌పూర్ (యుపి)లో మైనర్ మినరల్స్ అక్రమ మైనింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగులు ఇతర నిందితులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇసుక తవ్వకాలకు అక్రమంగా తాజా లీజులు ఇచ్చారని, ఉన్న లీజులను పునరుద్ధరించారని, ఇప్పటికే ఉన్న లీజుదారులకు పర్మిషన్‌ను అడ్డంకులు కల్పించారని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు అన్యాయంగా నష్టం వాటిల్లిందని, తమకు అనుచిత లబ్ధి చేకూరిందని ఆరోపించారు.
మైనర్ ఖనిజాలను అక్రమంగా తవ్వేందుకు, మైనర్ ఖనిజాలను చోరీకి పాల్పడేందుకు, లీజుదారులతో పాటు మైనర్ ఖనిజాలను రవాణా చేసే వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బులు దండుకునేందుకు ఇతర వ్యక్తులకు అనుమతులిచ్చారని ఆరోపించారు. అంతకుముందు, ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్, జలోన్, నోయిడా, కాన్పూర్, లక్నో జిల్లాల్లో, ఢిల్లీలోని 12 ప్రదేశాలలో 05.01.2019న కూడా సోదాలు జరిగాయి. సోదాల సమయంలో అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి నేరారోపణలు రాగా; భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com