Central New Scheme : ఆపదలో ఆదుకుంటే రూ.25వేలు.. కేంద్రం కొత్త స్కీమ్

ఆపదలో ఉన్న వారిని సకాలంలో హాస్పిటల్ లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య ‘గుడ్ సమారిటన్ స్కీం’ తెచ్చింది. ప్రమాదంలో గాయపడిన బాధితులను కాపాడితే రూ.25 వేల బహుమతి అందుకోవచ్చని పోలీసులు తెలిపారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిలో చాలామంది సకాలంలో వైద్య సేవలు అందక ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్లే ఎక్కువ. రక్తమోడుతున్న బాధితులను సాధ్యమైనంత వేగంగా ఆసుపత్రులకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఆ టైంలో ప్రతీక్షణం విలువైనదే. అంబులెన్స్ వచ్చేలోగా బాధితులు ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల కిందట గుడ్ సమారిటన్ పథకం తీసుకొచ్చింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి వారి ప్రాణాలు నిలబడేలా చేస్తే రూ.5 వేలు ప్రోత్సాహకం అందించేది. బాధితులను ఆసుపత్రిలో చేర్పించిన వారికి కేసుల భయం లేకుండా చర్యలు తీసుకుంది. ఐతే.. తాజాగా ఈ బహుమతిని రూ.25 వేలకు పెంచింది. ఎక్కువ మందిని కాపాడితే రూ.లక్ష వరకు అందుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లాక స్థానిక పోలీసులకు సమాచారం అందించండి. పోలీసులు ప్రమాద వివరాలు, బాధితులను కాపాడిన వారి వివరాలు తీసుకుని రవాణా, రెవెన్యూ, పోలీస్, హైవే ఉన్నతాధికారుల సమక్షంలో నగదు బహుమతి అందిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com