Government Bungalows : ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని ఓడిన ఎంపీలకు కేంద్రం ఆదేశం

Government Bungalows : ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని ఓడిన ఎంపీలకు కేంద్రం ఆదేశం
X

సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీలు ఢిల్లీలోని అధికారిక నివాసాలను ఈ నెల 11లోపు ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ నోటీసులిచ్చింది. విజయం సాధించిన సిట్టింగ్ ఎంపీలు గతంలో కేటాయించిన నివాసాల్లో అలాగే కొనసాగుతారు. బంగ్లాలను ఖాళీ చేయాల్సిన వారిలో స్మృతీ ఇరానీ, ఆర్కే సింగ్, అర్జున్ ముండా, రాజీవ్ చంద్రశేఖర్, మురళీధరన్, భారతీ పవార్ తదితర ప్రముఖులు కూడా ఉన్నారు.

కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చకు లోక్‌సభ‌లో కేంద్రం 16 గంటల సమయాన్ని కేటాయించింది. మరోవైపు ఇదే సమయంలో నీట్ పేపర్ లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story