Train Timetable Changes : 94 రైళ్ల టైమ్ టేబుల్‌లో ఇవాళ్టి నుంచి మార్పులు

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 94 రైళ్ల టైమ్ టేబుల్‌లో ఇవాళ్టి నుంచి మార్పులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందులో తిరుపతి-కాకినాడ, తిరుపతి-ఆదిలాబాద్, లింగంపల్లి-విశాఖ, షాలిమర్-హైదరాబాద్, హైదరాబాద్-తాంబరం సహా పలు రైళ్లు ఉన్నాయి. అలాగే మరికొన్ని రైళ్లకు కొన్ని స్టేషన్లలో కొత్తగా హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. హైదరాబాద్ నుంచి ముంబయి అక్కడ నుంచి హైదరాబాద్ (22731/22732), హైదరాబాద్-ముంబయి-హైదరాబాద్ (12702/12701), తిరుపతి-హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి (12707/12708), నాందేడ్-అమృత్‌సర్-నాందేడ్ (12715/12716), హైదరాబాద్-జైపుర్-హైదరాబాద్ (12720/12719), హైదరాబాద్-విశాఖపట్నం-హైదరాబాద్ (12728/12727), హైదరాబాద్-తాంబరం-హైదరాబాద్ (12760/12759), తిరుపతి-హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి (12793/12794), సికింద్రాబాద్-హిస్సార్-సికింద్రాబాద్(22737/22738). ఈ రైళ్లలో ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు వస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com