Arvind Kejriwal : బెల్ట్, ఇంటి భోజనం, భగవద్గీత కావాలని కోరిన సీఎం కేజ్రీవాల్..

Arvind Kejriwal : బెల్ట్, ఇంటి భోజనం, భగవద్గీత కావాలని కోరిన సీఎం కేజ్రీవాల్..
X

లిక్కర్ స్కాం కేసులో అరెస్టెన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ను ( Arvind Kejriwal ) సీబీఐ మూడు రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ కస్టడీలో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కావాలని కోర్టుకు కేజ్రివాల్ విజ్ఞప్తి చేశారు. ఇంటి నుంచి భోజనం, కళ్లద్దాలు. డాక్టర్లు సూచించిన మందులు, చదువుకోవడానికి భగవద్గీత కావాలని కోరగా.. అందుకు న్యాయస్థానం అంగీకరించింది.

అలాగే ప్యాంట్ కి బెల్ట్ లేకపోపడంతో తాను ఇబ్బంది పడుతున్నానని.. జైలు నుంచి కోర్టుకు తిరిగే టైంలో ప్యాంటు చేత్తో పట్టుకుని ఉండాల్సి పస్తోందని ఆయన కోర్టుకు విన్నవిం చారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. ప్యాంట్ బెల్ట్ ను కూడా అనుమతించింది. వీటితో పాటు ఆయన భార్య సునీత, బంధువులను ప్రతిరోజు ఒక గంటపాటు కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.

Tags

Next Story