CM Revanth Reddy : కేరళలో సీఎం రేవంత్ రెండు రోజుల పర్యటన.. రాహుల్ కు బాసట

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళ పర్యటనలో ఉన్నారు. కేరళలోని వాయనాడ్ లో కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్ గాంధీ తరఫున ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అక్కడి తెలుగువారిని ఆకర్షించేలా రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో సీఎం రేవంత్ పేరు ఉంది. తెలుగువాళ్లు ఎక్కడుంటే అక్కడ రేవంత్ రెడ్డి వెళ్లి కీలకమైన ప్రచారం చేయనున్నారు. రేవంత్ తో పాటు.. పలువురు తెలుగు కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారం చేస్తారు. బుధ, గురు రెండు రోజుల పాటు కేరళలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు రేవంత్ రెడ్డి.
రాహుల్ గాంధీ తరుఫున వాయనాడ్‌లో రేవంత్ ప్రచారం కీలకంగా చెప్పుకోవచ్చు. అక్కడ కాంగ్రెస్ కు పడే ప్రతి ఓటూ కీలకంగా మారింది. గతంలో గెలిచినట్టుగా ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అంత అనుకూల వాతావరణం లేదని తెలుస్తోంది. దీంతో.. రేవంత్ రెడ్డిని రాహుల్ బరిలో దింపుతున్నారు. సీతక్క కూడా ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. ఏప్రిల్ 26న కేరళలో పోలింగ్ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com