CM Stalin Warning : కల్తీసారా నేరాలను సహించబోం.. సీఎం స్టాలిన్ వార్నింగ్

తమిళనాడులో కల్తీ సారా తాగి మొత్తం 33 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగనుంది. మరో 60 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు వీరిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ విషాద ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది.
కల్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మరణించిన వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని సీఎం స్టాలిన్ ( CM Stalin ) అన్నారు. "నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం. అడ్డుకోవడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. ఇలాంటి నేరాలకు పాల్పడే వారి గురించి ప్రజలు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలను సహించబోమని' సీఎం స్టాలిన్ తెలిపారు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరో పక్క కేసును క్షుణ్ణంగా విచారించాలని సీబీసీఐడీని సీఎం స్టాలిన్ ఆదేశించారు. కళ్ల కురిచ్చి జిల్లా కలెక్టర్ శ్రవణ్ కుమార్ జాదావత్ను బదిలీ చేసి ఎంఎస్ ప్రసాద్ ను నియమించారు.
జిల్లా ఎస్పీ సమైసింగ్ మీనాని కూడా తొలగించి రజత్ చతుర్వేదికి బాధ్యతలు అప్పగించారు. జిల్లా ప్రొహిబిషన్ ఎన్ ఫోర్స్ మెంట్ యూనిట్ కు చెందిన డీఎస్సీ తమిళ్ సెల్వన్ నేతృత్వంలోని బృందాన్ని సస్పెండ్ చేశారు. మంత్రులు ఇ.వి.వేలు, ఎం. సుబ్రమణ్యం కళ్లకురిచ్చి ఆస్పత్రిని సందర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com