Shyam Rangeela : మీ సపోర్ట్‌తో మోదీకి పోటీగా నామినేషన్ వేశా: కమెడియన్ శ్యామ్ రంగీలా

X

ప్రధాని మోదీ పోటీ చేయనున్న వారణాసిలో 41 మంది నామినేషన్ వేశారు. చివరిరోజు కావడంతో కమెడియన్ శ్యామ్ రంగీలాతో సహా 27మంది విజయవంతంగా నామినేషన్ వేశారు. దీనిపై శ్యామ్ రంగీలా స్పందిస్తూ.. ‘మీ సపోర్ట్‌తో విజయవంతంగా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశాను. నా ఎన్నికల భవిష్యత్తు ఎన్నికల అధికారుల చేతుల్లో ఉంది. ప్రజాస్వామ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. రాబోయే మూడు రోజులు కీలకం’ అని ట్వీట్ చేశారు.

రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో పుట్టి, పెరిగిన 29 ఏళ్ల శ్యామ్ రంగీలా యానిమేషన్ కోర్సు చేశారు. మిమిక్రీలో, ముఖ్యంగా రాజకీయ నాయకులను అనుకరించడంలో మంచి నేర్పరిగా పేరు తెచ్చుకున్నారు. ''ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్'' అనే టీవీషోతో ఆయన పాపులర్ అయ్యారు. మోదీతో పాటు రాహుల్ గాంధీ వంటి ప్రముఖుల ప్రసంగాలను కూడా మిమిక్రీతో ఆయన అనుకరించేవారు. కొద్దికాలంగా మోదీ, ఆయన విధానాలపై విమర్శకుడిగా రంగీలా మారినట్టు ఆయన చేసిన పలు వీడియోలు చెబుతున్నాయి. వారణాసి నుంచి మోదీపై తాను పోటీ చేయనున్నట్టు మే 1న రంగీలా ప్రకటించారు.

Tags

Next Story