Congress : కాంగ్రెస్ సర్కారు కుప్పకూలే చాన్స్.. తాజా పరిణామాలు ఇవే..!

Congress : కాంగ్రెస్ సర్కారు కుప్పకూలే చాన్స్.. తాజా పరిణామాలు ఇవే..!

Congress : హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం పతనం అంచున నిలబడింది. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల క్రాస్‌ ఓటింగ్‌తో రాష్ట్రంలోని హస్తం పార్టీ ప్రభుత్వం కూలడం ఖాయమైంది. ఆరుగురు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రతిపక్ష బీజేపీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. మరికొంత మంది ఎమ్మెల్యేలను కమలం పార్టీ తమవైపునకు తిప్పుకొంటే.. కాంగ్రెస్‌ సర్కార్‌ కుప్పకూలే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అంతకుముందు అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత, మాజీ సీఎం జైరాం ఠాకూర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని, సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story