Congress : నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Congress : నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను (Manifesto) కాంగ్రెస్ పార్టీ (Congress) ఈరోజు విడుదల చేయనుంది. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యమిచ్చే అంశాలను ఇందులో ప్రస్తావించనుంది. ఉపాధి హక్కుపై యువతకు భరోసా ఇవ్వనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీపై కఠినమైన చట్టాన్ని రూపొందించే హామీకి ఇందులో చోటివ్వనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా ఉదయం 11:30 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

సామాజిక న్యాయం, రైతు న్యాయం , కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం పేరుతో ప్రజలకు హామీ ఇవ్వనుంది. సామాజిక సమాజాల్లో కులగణన రిజర్వేషన్ల పరిమితిని తీసివేయడం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై హామీలు ఇవ్వనుంది, అలాగే రైతు న్యాయంలో పంటకు కనీస మద్దతు ధర, రైతుల రుణమాఫీకి శాశ్వత కమిషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించనుంది కాంగ్రెస్. అలాగే వ్యవసాయంలో ఉపయోగించే వస్తువులను జీఎస్టీ నుంచి తొలగించాలని నిర్ణయించిందని సమాచారం.

మరోవైపు.. మేనిఫెస్టో విడుదలకు ముందే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈశాన్య దిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల కుటుంబాలకు హామీ కార్డులు పంపిణీ చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story