Viral : మెట్రోలో హద్దు మీరిన యువతీ యువకులు.. కిస్సింగ్ సీన్స్

నేటితరం యువతీయువకులు రెచ్చిపోతున్నారు. సిగ్గు, శరం లేకుండా ఆధునిక పోకడల పేరుతో ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీ మెట్రో యువ జంటల రాసలీలలకు కేరాఫ్‌గా మారింది. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా వారి బుద్ధి మారడం లేదు. నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న ఢిల్లీ మెట్రోలో ఎన్నో ప్రేమజంటల శృంగార చేష్టలు వెలుగు చూశాయి. తోటి ప్రయాణికులు అభ్యంతరం చెబుతున్నా లెక్క చేయడం లేదు.
అందరి ముందే వెకిలి చేష్టలు చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇటీవల గట్టి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కొన్నిరోజులుగా ఆగినట్లే అనిపించింది. తాజాగా ఢిల్లీ మెట్రోలో జంట మెట్రో కోచ్‌లో కౌగిలింతలు, ముద్దులతో రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ప్రయాణికుల్లో కొందరు ఇలాంటి దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నా కూడా వారిలో మార్పు రావడం లేదు. తాజా వీడియోపై నెటిజన్లు, ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రయాణికులు ఇలాంటి కార్యకలాపాలకు పాల్పొడొద్దని మెట్రో రైల్ కార్పొరేషన్ పదే పదే హెచ్చరిస్తోంది. బుద్ది మార్చుకోని ఇలాంటి వారిపై కేసులు పెట్టాలని నెటిజన్లు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com