Controversy in Bengal : బెంగాల్‌లో రచ్చ... నడిరోడ్డుపై మహిళను కొట్టిన టీఎంసీ నేత

వెస్ట్ బెంగాల్లో ఓ వ్యక్తి నడిరోడ్డుపై అంతా చూస్తుండగా మహిళతో పాటు మరో వ్యక్తిని దారుణంగా కొడుతున్న ఘటన వైరల్ అయింది. ప్రతిపక్ష బీజేపీ, అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడుతోంది. నిందితుడు తృణమూలికి చెందిన స్థానికంగా ఉండే బలమైన నేత అని బీజేపీ ఆరోపించింది.
ఈ వీడియో బెంగాల్లోని ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని చోప్రాకి చెందినదిగా బీజేపీ, సీపీఎం ఆరోపించాయి. ప్రతిపక్షాలు నిందితుడిని స్థానికంగా బలమైన వ్యక్తిని తాజెముల్ గుర్తించారు. ఇతడికి అధికార టీఎంసీతో సంబంధాలు ఉన్నాయి. స్థానిక వివాదాల్లో తక్షణ న్యాయం అందించే వ్యక్తిగా ఇతనికి పేరుంది. అయితే, వైరల్ అవుతున్న వీడియోలో బాధితులను ఎందుకు కొడుతున్నాడనే విషయం అస్పష్టంగా ఉంది. ఈ వీడియోపై తృణమూల్ కాంగ్రెస్ ఇంకా స్పందించలేదు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ( Mamata Banerjee ) రాక్షస పాలనకు ఈ ఘటన నిదర్శనమని బీజేపీ ఆరోపించింది. "ఒక మహిళను కనికరం లేకుండా కొడుతున్న వ్యక్తి తాజెముల్. ఇతడు సత్వర న్యాయం చేయడానికి ప్రసిద్ధి చెందాడు. చోప్రా ఎమ్మెల్యే హమీదుర్ రెహమాన్ సన్నిహితుడు. పశ్చిమ బెంగాల్లో షరియా కోర్టుల వాస్తవితపై దేశం మేల్కోవాలి. ప్రతీ గ్రామంలో సందేశా ఖాళీ ఉంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహిళలకు శాపం. సందేశాఖాలీ ఘటనలో నిందితుడిని రక్షించినట్లు ఇతడిని కూడా రక్షిస్తుందా..?" అని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com