DD News : కాషాయ రంగులో డీడీ న్యూస్.. ప్రతిపక్షాల విమర్శలు

డీడీ న్యూస్ లోగో కలర్ మారడం వివాదాస్పదమైంది. గతంలో రూబీ రెడ్ రంగులో ఉన్న లోగో ఇటీవల కాషాయ రంగులోకి మారింది. ఏప్రిల్ 16 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా డీడీ న్యూస్ ప్రకటించింది. ఈ సందర్భంగా... లోగో మారింది తప్ప చానెల్ విలువల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ‘‘వేగం కంటే కచ్చితత్వాన్ని, అబద్ధాల కంటే నిజాన్ని, సంచలనాల కంటే సత్యాన్ని మాత్రమే ముందుంచే దూరదర్శన్... తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది’’ అని పోస్ట్ చేసింది.
అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. లోగో లుక్ మెరుగుపర్చేందుకే రంగు మార్చామని డీడీ న్యూస్ ఇచ్చిన వివరణను తోసిపుచ్చుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందే రంగు మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాయి. ప్రసార భారతి ప్రచార భారతిగా మారిందని TMC ఎంపీ జవహార్ సిర్కార్ విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com