Prajwal Revanna : ఉద్దేశపూర్వకంగా ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల సర్క్యులేషన్

25 వేల పెన్ డ్రైవ్లలో కర్ణాటక మొత్తం ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వీడియోలు పంపిణీ చేశారనీ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ సీఎం జేడీఎస్ అధినేత కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో సంచలనం రేపుతున్నాయి. హసన్ ఎంపి రేవణ్ణ అనేకమంది మహిళలపై లైంగిక హింసకు పాల్పడ్డారన్న అభియోగాలపై కేసు నడుస్తున్న వేళ కర్ణాటకలో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణ పాల్గొన్నారని చెపుతున్న మహిళలపట్ల వేధింపుల వీడియోలను 25వేల పెన్ డ్రైవ్లోకి మార్చి హసన్ నియోజకవర్గంలోను, రాష్ట్రంలోను పంపిణీచేసారని మాజీ సీఎం జెడిఎస్ అధినేత కుమారస్వామి ఆరోపించారు.
ఈ కుట్ర వెనుక ప్రధాన హస్తం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డికె శివ కుమార్ ఉన్నారని ఆయన ఆరోపించారు. ఓపక్క ప్రత్యేక దర్యాప్తు కమిటీ విచారణచేస్తున్న తరుణంలో ఎన్నికల సమయంలో జెడిఎన్ పార్టీని, హసన్ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కుట్రలకు పాల్పడుతున్నారని, ఇక సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలని ఆయన అన్నారు. సిద్ధరామయ్య పోలీస్ టీమ్ దర్యాప్తు పక్షపాతవైఖరితో చేస్తోందని ఆరోపించారు.
మొత్తం 25వేలకు పైగా పెన్ డ్రైవ్లు రాష్ట్రం మొత్తం చెలామణి అయ్యాయని...కర్ణాటకలో శివకుమార్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సిద్ధరామయ్య ఇన్వెస్టిగేషన్ టీమ్స్ నడుస్తున్నాయని కుమారస్వామి ఎద్దేవా చేసారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com