India Corona: కరోనా డేంజర్‌ బెల్స్.. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్‌ స్థాయిలో కేసులు..

India Corona: కరోనా డేంజర్‌ బెల్స్.. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డ్‌ స్థాయిలో కేసులు..
India Corona: దేశంలో కరోనా డేంజర్‌బేల్స్ మోగిస్తుండగా.. ఒమిక్రాన్ సైతం అలజడి సృష్టిస్తోంది.

India Corona: దేశంలో కరోనా డేంజర్‌బేల్స్ మోగిస్తుండగా.. ఒమిక్రాన్ సైతం అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకు రెట్టింపు కేసులు వెలుగు చూస్తుండటం ప్రధాన రాష్ట్రాల్లో దడ పుట్టిస్తోంది. అటు దేశంలో ఒక్కరోజు వ్యవధిలో 2 లక్షల 50వేల 89 కేసులు నమోదుకాగా.. మహమ్మారి కారణంగా 385 మంది మృత్యువాతపడ్డారు. కరోనా పాజిటివిటి రేటు సైతం 24 గంటల్లో 16.28 శాతం నుంచి 19.65 శాతానికి చేరింది.

అటు రికవరీ రేటు 94.27 శాతంగా ఉండటం ఊరటనిస్తోంది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు ఆరు శాతం పెరి కొత్తగా 8వేల 209 కేసులు నమోదయ్యాయి. అటు ప్రధాన రాష్ట్రాల్లో కరోనా జోరు కొనసాగుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 31వేలు, కర్ణాటకలో 27వేల156 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనా వణుకుపుట్టిస్తోంది. కొత్తగా 22వేల 946కేసులు వెలుగులోకి వచ్చాయి.

కరోనా దృష్టా.. ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు జరగాల్సిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్నికేరళ వాయిదా వేసింది. ఢిల్లీలో 12,527 మందికి పాజిటివ్​ తేలింది. ఢిల్లీ పోలీసుల్లో కరోనా సోకుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో బూస్టర్‌ డోసు అందించేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. యూపీ, బంగాల్, ఒడిశాలోనూ కరోనా విజృంభిస్తోంది.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 157 కోట్లకుపైగా టీకా డోసులు అందించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్లున్న 3.5 కోట్ల మందికి మొదటి డోస్ పూర్తిచేసినట్లు కేంద్రం తెలిపింది. అటు తమిళనాడు సర్కార్‌ సైతం టీనేజ్‌లకు తొలిడోసు పూర్తయినట్టు వెల్లడించింది.

దేశంలో 15 నుంచి 18 ఏళ్ల టీనేజ్‌వారికి వ్యాక్సినేషన్ పూర్తయితే.. 12 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు టీకాల ప్రక్రియ మార్చిలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు నేషనల్‌ టెక్నికల్‌ ఆడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ కి చెందిన కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోడా తెలిపారు. మరోవైపు 60 ఏళ్లు పైబడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రికాషన్‌ డోసుల పంపిణీ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story