Covid In India: దేశంలో మళ్లీ కరోనా టెన్షన్.. పాజిటివ్ కేసులు ఎంత పెరిగాయంటే..?

Covid In India: దేశంలో మళ్లీ కరోనా టెన్షన్.. పాజిటివ్ కేసులు ఎంత పెరిగాయంటే..?
Covid In India: రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతుండటం కలవరపెడుతోంది. తాజాగా 4 వేలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి.

Covid In India: దేశంలో మరోసారి కరోనా కేసుల పెరుగుదల టెన్షన్ పెడుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతుండటం.. కలవరపెడుతోంది. తాజాగా 4 వేలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి. కోలుకున్నవారి కంటే కొత్త కేసులు పెరుగుతుండటంతో.. ఆ ప్రభావం యాక్టివ్ కేసులపై పడింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతానికి ఉండగా..వీక్లీ పాజిటివిటీ రేటు కూడా ఒకటికి చేరువలో ఉంది. తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఐదు రాష్ట్రాలకు హెచ్చరిక చేస్తూ లేఖలు రాసింది.

అటు మహారాష్ట్రలో మహమ్మారి గుబులురేపుతోంది. ఆదివారం 15 వందల మందికి వైరస్‌ సోకగా..సోమవారం వేరియంట్ ఉదృతి కాస్త తగ్గింది. సోమవారం కొత్తగా 676 మంది వైరస్​బారినపడ్డారు. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదని బృహన్​ ముంబయి కార్పొరేషన్ పేర్కొన్నది. వైరస్ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుండటంతో.. పరీక్షలను పెంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముంబయిలోనూ పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతున్న సంకేతాలు వెలువడటంతో నాలుగో వేవ్ భయం పట్టుకుంది. తమిళనాడులో ఏకంగా 12 BA.4, BA.5 కేసులు బయటపడ్డాయి.

పలు దేశాలను వణికిస్తోన్న మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. అటు భారత్​లో నోరో వైరస్ కలకలం రేపింది. కేరళలోని విళింజం, తిరువనంతపురంలోని ఇద్దరు విద్యార్థులకు ఈ కొత్త వైరస్‌ను గుర్తించారు. తొలుత నోరోవైరస్ వ్యాప్తి కేరళలో గతేడాది జూన్‌లో ప్రారంభమైంది. నోరో వైరస్‌ ప్రధాన లక్షణమైన 950 డయేరియా కేసులు నమోదయ్యాయి. నోరో వైరస్ సోకిన 12 నుంచి 48 గంటల్లో దాని లక్షణాలు కనిపించనున్నట్లు వైద్యులు చెబుతున్నారు. విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, జర్వం, ఒళ్లు నొప్పులతో గుర్తించ వచ్చన్నారు.

కలుషిత నీటి వల్లే ఈ తరహా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వైరస్ బారినపడ్డవారిలోఅధికంగా ఐదేళ్లులోపు పిల్లలే ఉండటం కలవరపెడుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ.. సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది. కేసులు మరోసారి పెరుగుతున్న వేళ..దేశంలో ఫోర్త్ వేవ్ తెరపైకి వస్తోంది. కరోనా నాలుగో వేవ్‌ వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. కొత్త మ్యుటెంట్లు లేకపోవడం, వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఏర్పడటంలాంటి కారణాలతో వైరస్ ప్రమాదం అంతమాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story