Exit Polls : ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ కీలక నిర్ణయం

Exit Polls : ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ కీలక నిర్ణయం

ఏప్రిల్-మే రెండు నెలలు దేశంలో ఎన్నికల సీజన్ గా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లి అదృష్టం టెస్ట్ చేసుకుంటుంటాయి. ఏ రాజకీయ పార్టీ ముందుంది, ఏ అభ్యర్ధికి ప్రజల్లో ఆదరణ ఉందన్న దానిపై సర్వేలు, ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ నిర్వహణలో ఏజెన్సీలు బిజీగా ఉన్నాయి. సాధారణ సర్వేలు, ఒపీనియన్ పోల్స్ కూ, ఎగ్జిట్ పోల్స్ కూ వ్యత్యాసం ఉంది. ఎన్నికలకు ముందు ఒపీనియన్ పోల్స్, సర్వేలు నిర్వహిస్తారు.

ఎగ్జిట్ పోల్స్ మాత్రం కొంత డిఫరెంట్. ఓట్లు ఎవరికి పడ్డాయని చెప్పేదే ఎగ్జిట్ పోల్స్. ఎగ్జిట్ పోల్స్ రావాలంటే ఎన్నికల తంతు పూర్తికావాల్సిందే. ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి.. ఎగ్జిట్ పోల్స్ చెప్పాలంటే.. ఈ ఏడు దశలు అయిపోవాల్సిందే. ఒక్కో దశ పూర్తి కాగానే అలా చెప్పడానికి లేదు.

గతంలో ఎగ్జిట్ పోల్స్ కొన్ని ఒక్కో ఫేజ్ ముగియగానే చెబుతుండేవాళ్లు. దీంతో..మిగతా దశల్లో ఓట్లు వేసేవాళ్ల మైండ్ సెట్ ను ఆ సర్వేలు ప్రభావితం చేసేవి. కాబట్టి.. దీనికి అవకాశం ఇవ్వొద్దని ఈసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏడు దశలూ ముగిసిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించేలా ఈసీ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకటనలను బ్యాన్ చేసింది ఈసీ. దీంతో.. జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story