Rahul Gandhi : నోట్ల రద్దుతో దేశం తీవ్రంగా నష్టపోయింది : రాహుల్ గాంధీ

Rahul Gandhi : నోట్ల రద్దుతో దేశం తీవ్రంగా నష్టపోయింది : రాహుల్ గాంధీ
X

నోట్ల రద్దుతో దేశం తీవ్రంగా నష్టపోయిందని విపక్ష నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) విమర్శించారు. ‘నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశ ప్రజలకు కలిగిన లాభం ఏంటి? జీఎస్టీ వల్ల ప్రజలు, వ్యాపారులు ఎన్నో బాధలు పడ్డారు. నోట్ల రద్దుతో యువత ఉపాధి కోల్పోయారు. దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా మోదీ చెప్పారు. నోట్ల రద్దు చేయాలని కూడా దేవుడే చెప్పాడా? అదానీ లాంటి పెద్దల కోసమే మోదీ నిర్ణయాలు తీసుకుంటారు’ అని మండిపడ్డారు.

పేద విద్యార్థులు NEETపై నమ్మకం కోల్పోయారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీట్ కోసం విద్యార్థులు ఏళ్ల పాటు చదువుతారు. ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయిన NEETను కమర్షియల్ ఎగ్జామ్‌గా మార్చారు. బీజేపీ హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి. నీట్ పేద విద్యార్థుల కోసం కాదు ఉన్నత వర్గాల కోసం అనే విధంగా మార్చారు. నీట్ పరీక్ష విధానంలో అనేక లోపాలు ఉన్నాయి’ అని ధ్వజమెత్తారు.

Tags

Next Story