Dengue : కర్ణాటకలో ప్రమాదకరంగా ప్రబలుతున్న డెంగ్యూ
కర్ణాటక రాష్ట్రాన్ని డెంగ్యూ వైరస్ వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 24 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ఆరుగురు చనిపోయారు. బెంగళూరులో డెంగ్యూ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
కర్ణాటక వ్యాప్తంగా 12వేల కేసులు నమోదైతే... ఒక్క బెంగళూరు నగరంలోనే మరో12 వేల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 286 డెంగ్యూ కేసులను గుర్తించారు. మొత్తం 52వేల214 మందికి బ్లడ్ టెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. డెంగ్యూ విజృంభణతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం అయింది. డెంగ్యూ కేసులపై నిఘా ఉంచాలని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు జిల్లా అధికారులు, జిల్లా పంచాయతీ సీఈవోలను ఆదేశించారు.
డెంగ్యూ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫీవర్ క్లినిక్ లను తెరవాలని, అక్టోబర్ వరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com