Ayodhya : అయోధ్యకు పోటెత్తిన భక్త జనం

Ayodhya : అయోధ్యకు పోటెత్తిన భక్త జనం
X

అయోధ్యకు భక్తులు పోటెత్తారు. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు వచ్చిన వారంతా పనిలో పనిగా యూపీలోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. దాంతో అయోధ్యకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. మహా కుంభమేళా ఈనెల 13న ప్రారంభమవగా ఈనెల 29న మౌని అమావాస్య ఉంది. ముందస్తుగానే యూపీకి చేరుకోవడంతో.. స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే పదికోట్లకుపైగా జనం పుణ్యస్నానాలు ఆచరించినట్లు భావిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజు అయోధ్య రామాలయాన్ని దాదాపు 10 లక్షలకు పైగా భక్తుల సందర్శించినట్లు సమాచారం.

Tags

Next Story