Prashant Kishor : ప్రశాంత్ కిషోర్‌పై దీదీ ఆగ్రహం

Prashant Kishor : ప్రశాంత్ కిషోర్‌పై దీదీ ఆగ్రహం
X

ప్రశాంత్ కిషోర్ పై మరోసారి ఫైరయ్యారు బెంగాల్ సీఎం మమత బెనర్జీ. బెంగాల్ లో నూ బీజేపీ ఈ సారి మెజార్టీ సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ తన అంచనాకు చెబుతున్నారు. ఇది మమతా బెనర్జీకి కోపం తెప్పిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీని తట్టుకోవడం కష్టమని అనుకుంటున్న సమయంలో ప్రశాంత్ కిషోర్ బెంగాల్ లో తృణమూల్ కు పని చేసి దీదీని గెలిపించడంలో సాయం అందించారు.

అప్పట్లో బీజేపీ చేసే ప్రచారాలకు ప్రశాంత్ కిషోర్ గట్టిగా కౌంటర్ ఇచ్చేవారు. చాలా సర్వేలు బీజేపీకి అనుకూలంగా వస్తే .. పీకేనే.. బీజేపీ గెలవదని చాలెంజ్ చేసేవారు. ఫలితాలు పీకే చెప్పినట్లుగా వచ్చాయి. అయితే ఆ తర్వాత పీకే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పనులు మానేశారు. ఇప్పుడు బెంగాల్ లో దీదీ కొంత గడ్డు పరిస్థితి ఫేస్ చేస్తోంది. బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని కూడా సర్వేలు చెబుతున్నాయి.

శాంతిభద్రతల సమస్యలు.. కమ్యూనిస్టు క్యాడర్ దీదీని ఓడించడానికైనా బీజేపీకి ఓటేయడానికి సిద్ధపడటం.. తృణమూల్ కు సమస్యగా మారింది.

Tags

Next Story