TS : తిహార్ జైల్లో కవిత ఏం తింటున్నారో తెలుసా..?

TS : తిహార్ జైల్లో కవిత ఏం తింటున్నారో తెలుసా..?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) అరెస్టై తిహార్ లో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కోర్టు కవితకు 14 రోజులపాటు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆమె తీహార్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కవిత తీహార్ జైలుకు వెళ్లిన నేపథ్యంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

తీహార్ అనే గ్రామంలో ఉన్నది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. మనదేశంలో పేరుపొందిన నాయకుల నుంచి కరడుగట్టిన నేరస్తుల వరకు తీహార్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. 6వేల ఖైదీల సామర్థ్యంతో ఈ జైలు నిర్మించారు. సామర్థ్యానికి మించి ఇందులో ఖైదీలు ఉంటారు. వీవీఐపీ ఖైదీలను కూడా ఈ జైలుకే తరలిస్తారు. భోజనం విషయంలో.. మాత్రం ఆ స్థాయి చూపించరు.

ఒకవేళ అనారోగ్య సమస్యలు ఏవైనా ఎదుర్కొంటుంటే.. న్యాయమూర్తి ఆదేశాలతో ప్రత్యేకమైన ఆహారం తెప్పించుకునే వెసులు బాటు ఉంటుంది. ఆ ఆహారాన్ని జైల్లో ఉన్న డైటీషియన్ పరీక్షించిన తర్వాతే ఖైదీకి ఇస్తారు. ఆమెకు హైబీపీ ఉందని ఇటీవల ఆమె తరపు న్యాయవాదులు చెప్పినప్పటికీ.. భోజనం విషయంలో ఆమె కోర్టు నుంచి ప్రత్యేకమైన ఆదేశాలు తెచ్చుకున్నారు. ఆమెకు ప్రతిరోజు ప్రత్యేకమైన భోజనం వస్తోంది.

తీహార్ జైల్లో ఖైదీలకు ఉదయం పూట చపాతీ లేదా రోటి.. దాంతోపాటు కూర ఇస్తారు. మధ్యాహ్నం అన్నం, రోటీ లేదా చపాతి, కూర, పెరుగు వడ్డిస్తారు. రాత్రి కూడా ఇదే మెనూ అమలు చేస్తారు. ఒకవేళ జైలు క్యాంటీన్లో ఏదైనా కొనుక్కోవాలి అంటే.. కచ్చితంగా జైలు ఆవరణలో పనిచేయాలి. చేసిన పని ఆధారంగా జైలు అధికారులు చెల్లించే డబ్బులతోనే అక్కడ ఏవైనా తినుబండారాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బయటనుంచి నగదును ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. ఐతే.. తనకు పెన్ను, పేపర్ ఇవ్వడం లేదని.. బెడ్ షీట్స్ తెచ్చుకునే సౌకర్యం కల్పించలేదని.. కవిత కోర్టుకు వెళ్లడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story