కేజ్రీవాల్‌కు పెరిగిన షుగర్.. జైలులో ఇన్సులిన్ ఇచ్చిన డాక్టర్స్

కేజ్రీవాల్‌కు పెరిగిన షుగర్.. జైలులో ఇన్సులిన్ ఇచ్చిన డాక్టర్స్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్నారాయన. దీంతో.. తొలిసారి ఆయనకు ఇన్సులిన్ అందించారు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.

జైలులో సీఎం కేజ్రీవాల్ షుగర్ లెవెల్ తరుచుగా పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ షుగర్ లెవల్ 320కి చేరుకుంది. సోమవారం అరవింద్ కేజ్రీవాల్‌కు రూస్ అవెన్యూ కోర్టు నుండి మరో దెబ్బ తగిలింది. ప్రతిరోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వైద్యులను సంప్రదించేందుకు అనుమతి కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.

కేజ్రీవాల్ వైద్య అవసరాలను, ముఖ్యంగా ఇన్సులిన్‌కు సంబంధించి అంచనా వేయడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని సిటీ కోర్టు AIIMSని ఆదేశించింది. ఇంట్లో వండిన ఆహారం, డాక్టర్ సూచించిన ఆహారం అందించాలని సూచించింది. బీజేపీ చెప్పినట్టుగా దర్యాప్తు సంస్థ ఆడుతోందని ఢిల్లీ మంత్రి, ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్ ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story