ED Raids : వామ్మో.. ఈడీ దాడుల్లో రూ. 25కోట్లు సీజ్

ED Raids : వామ్మో..  ఈడీ దాడుల్లో రూ. 25కోట్లు సీజ్

ఎన్నికల టైంలో నోట్ల కట్టల పాములు బయటపడుతున్నాయి. ఝార్ఖండ్​లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. రాంచీలోని పలు ప్రాంతాల్లో ఏక కాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు ఇవాళ వరుస దాడులు నిర్వహించారు. ఝార్ఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్, అతనికి సంబంధించిన వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించగా ఏకంగా రూ.25 కోట్ల నగదును గుర్తించారు.

ఈ నగదుకు సంబంధించి ఎలాంటి లెక్కా పత్రాలు లేవని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్‌ఎల్‌ఏ) కింద ఫిబ్రవరి 2023లో అరెస్ట్ అయిన వీరేంద్ర రామ్‌కు సంబంధించిన ఆరు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. నగదుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక గదిలోని కరెన్సీ నగదు కట్టలు వీడియోలో కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం రాంచీలోని సెయిల్ సిటీతో సహా తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని ఈడీ వెల్లడించారు. మరోవైపు రోడ్ కన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇంజనీర్ వికాస్ కుమార్ ఆచూకీ కోసం మరో ఈడీ బృందం బరియాతు, మోరబాది, బోడియా ప్రాంతాల్లో దాడులు నిర్వహించిందని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story