ED Raids : ఈడీ స్పీడు.. ఆప్ ఎమ్మెల్యే ఇంట్లోనూ సోదాలు

ED Raids : ఈడీ స్పీడు.. ఆప్ ఎమ్మెల్యే ఇంట్లోనూ సోదాలు

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతల అవినీతిపై ఈడీ ఉక్కుపాదం మోపుతోంది. ఎక్సైజ్ పాలసీలో, సుదీర్ఘ విచారణ తర్వాత ఈడీ ఇప్పటివరకు చాలా మంది ఆప్ నాయకులను అరెస్టు చేసింది. ఈనేపథ్యంలో ఆప్‌కి చెందిన మటియాలా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌పై ఈడీ పట్టు బిగించింది. శనివారం ఉదయం ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ దాడులు చేసింది.

ఆప్ మటియాలా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ పేరు గతంలో పలు నేరాల్లో చార్జ్ షీట్ లోనూ ఉంది. గులాబ్ సింగ్ యాదవ్ గుజరాత్ ఇంచార్జిగా ఉన్నారు. 8 ఏళ్ల క్రితం దోపిడీ కేసులో కూడా ఎమ్మెల్యే అరెస్టయ్యారు. 2016లో గులాబ్ సింగ్ గుజరాత్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పుడు, అతని సహచరులపై దోపిడీ కేసులో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పార్టీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌పై జరిగిన ఈడీ దాడిపై ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం మొత్తం ప్రతిపక్షాలను జైల్లో పెట్టే పనిలో నిమగ్నమై ఉందని అన్నారు.

ఇండియాలో నియంత రాజ్యం నడుస్తోందని ఆప్ నేతలు ఫైరవుతున్నారు. తమ నలుగురు నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారనీ..తాము గుజరాత్‌లో ఎన్నికలలో పోటీ చేస్తున్నామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story