Kerala : లోక్ సభ ఎన్నికల వేళ కేరళలో సినిమా రచ్చ

Kerala : లోక్ సభ ఎన్నికల వేళ కేరళలో సినిమా రచ్చ

ఎన్నికల వేళ కేరళలో పరిస్థితి చర్చ్ vs చర్చ్ అన్నట్టు తయారైంది. క్రిస్టియన్ల ఓట్ల కోసం సినిమా/డాక్యుమెంటరీలు ప్రచార ఆయుధాలుగా మారాయి. వివాదాస్పద కేరళ స్టోరీ సినిమాను ఇడుక్కి డియోసీస్, కేరళ కాథలిక్ యూత్ మూ‌వ్‌మెంట్ సహా పలు క్రైస్తవ సంఘాలు చర్చీల్లో ప్రదర్శిస్తున్నాయి. ఇందుకు కౌంటర్‌గా మరికొన్ని సంఘాలు మణిపుర్ పరిస్థితులపై తెరకెక్కిన ‘క్రై ఆఫ్ ది అప్రెస్డ్’ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నాయి.

కేరళలో క్రైస్తవుల జనాభా 18% కాగా వీరిలో కాథలిక్, సిరియన్ క్రిస్టియన్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ప్రొటెస్టెంట్లు, లాటిన్ క్రిస్టియన్లు అధికార కూటమి, కమ్యూనిస్ట్ పార్టీల సమూహమైన LDFకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళల అక్రమ రవాణా, మతమార్పిడులు వంటి అంశాలతో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ బీజేపీకి అనుకూలం కావొచ్చనేది విశ్లేషకుల మాట. కాగా ఈ ప్రదర్శనలతో తమకు సంబంధం లేదని బీజేపీ పేర్కొంది.

కేరళ స్టోరీకి కౌంటర్‌గా మణిపుర్ డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి ప్రధాన కారణం కుకీ తెగ అంటున్నారు విశ్లేషకులు. ఈ తెగలో అధికశాతం మంది క్రైస్తవులే. మైతీ-కుకీల మధ్య జరిగిన హింసపై రూపొందిన ఈ డాక్యుమెంటరీ ఓట్లను ప్రభావితం చేయొచ్చంటున్నారు. పొలిటికల్ అజెండా లేదంటూనే ఇరు పక్షాలూ సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ స్టోరీ ప్రదర్శనలపై UDF, LDF కూటమి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోందట

Tags

Read MoreRead Less
Next Story