Tragedy : విద్యుదాఘాతంతో 14 మంది చిన్నారులకు గాయాలు
రాజస్థాన్‌లోని (Rajasthan) కోటాలో మహాశివరాత్రి (Maha Shivrathri) సందర్భంగా ఈరోజు (మార్చి 8) జరిగిన 'శివ్ బారాత్' ఊరేగింపులో దాదాపు 14 మంది పిల్లలు విద్యుదాఘాతానికి గురయ్యారు. గాయపడిన పిల్లలను కోటలోని MBS ఆసుపత్రిలో చేర్చారు. అవసరమైతే తదుపరి వైద్య చికిత్స కోసం వారిని జైపూర్‌కు రిఫర్ చేస్తారు. ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్, కోటా ఎంపీ ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులకు సరైన చికిత్స అందించాలని బీజేపీ ఎంపీ బిర్లా వైద్యులకు సూచించారు.
ప్రమాదంపై కోట ఎస్పీ
కోట ఎస్పీ అమృత దుహన్ మాట్లాడుతూ, "ఇది చాలా బాధాకరమైన సంఘటన. కాళీ బస్తీకి చెందిన ప్రజలు తమ కలశంతో ఇక్కడ గుమిగూడారు, ఒక పిల్లవాడు 20-22 అడుగుల పైపును మోసుకెళ్తున్నాడ. అది హైటెన్షన్ వైరును తాకింది. దీంతో అక్కడ ఉన్న పిల్లలందరూ విద్యుదాఘాతానికి గురయ్యారు, వారికి సరైన చికిత్స అందించడమే లక్ష్యంగా వారందరినీ ఆస్పత్రికి తరలించాం. అందుసో ఓ చిన్నారి 100% కాలిన గాయాలతో పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది".
రాజస్థాన్ మంత్రి హీరాలాల్ నగర్ మాట్లాడుతూ, "ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు, ఒకరికి 100% కాలిన గాయాలు ఉన్నాయి, సాధ్యమైన అన్ని చికిత్సలు అందించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం".
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com