Encounter : 2 రోజుల పాటు ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Encounter : 2 రోజుల పాటు ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులను వెతుకుతూ కుల్గాం జిల్లాలోని రెడ్‌వానీ పయీన్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి ప్రారంభమైన మిలిటరీ ఆపరేషన్ ఎట్టకేలకు గురువారం ఉదయం ముగిసింది. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

సోమ, మంగళవారాల్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చగా.. బుధవారం అర్ధరాత్రి మరో ఉగ్రవాదిని కాల్చిచంపారు. దీంతో ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య మూడుకు చేరింది. దాదాపు 40 గంటల పాటు ఈ ఎన్‌కౌంటర్ కొనసాగింది.

దీని వివరాలను భారత్ సైన్యం ట్విట్టర్ (ఎక్స్‌) వేదికగా వెల్లడించింది. కశ్మీర్‌లో శాంతి భద్రతలను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మట్టికరిచిన ఉగ్రవాదుల్లో లష్కరే తైబా టాప్ కమాండర్ బాసిత్ దార్ కూడా ఉన్నాడు. కశ్మీర్‌లో పలువురు నేతల హత్యకు అతడు కుట్ర పన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. లష్కరే తైబాకే చెందిన ఉగ్రవాదులు మోమిన్ గుల్జార్, ఫహీమ్ అహ్మద్ బాబా కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. వీరిద్దరూ కశ్మీర్‌లో ఉగ్రవాదులకు సాయం చేస్తుండే వారని తెలిసింది.

Tags

Next Story