Voters : వామ్మో.. ఒకే కుటుంబంలో 350 మంది ఓటర్లు

ఏప్రిల్19న అస్సాంలో తొలి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సోనిట్‌పూర్(D) ఫులోగురి నేపాలీ పామ్ గ్రామంలో ఒకే ఇంట్లో 350 ఓట్లు ఉన్నాయి. దివంగత బహదూర్ తాపా అనే వ్యక్తి ఐదుగురు భార్యల ద్వారా 12 మంది కొడుకులు, 9 మంది ఆడపిల్లలను కన్నారు. కోడళ్లు, అల్లుళ్లు, పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లతో కలిపి జనాభా 1,200కు చేరింది. వీరంతా అదే ఊరిలో 300 ఇళ్లలో నివసిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో వారందరూ ఓటు వేసేందుకు రెడీ అవుతుండటంతో రాజకీయ నేతలు వారి ఇంటికి క్యూకడుతున్నారు. అసోంలో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న కుటుంబాల్లో తాపా కుటుంబం కూడా ఒకటి. ఇక రాష్ట్రంలోని 14 లోక్‌సభ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com