Bengaluru GT Mall : ధోతీ కట్టిన రైతు పవర్.. బెంగళూరు జీటీ మాల్ మూసివేత

ధోతీ ధరించిన రైతుని మాల్ లోకి నిరాకరించిన బెంగళూర్ ఘటన యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ధోతీ ధరించాడని చెబుతూ రైతుని, అతని కొడుకుని సినిమా టిక్కెట్లు ఉన్నప్పటికీ జీటీ మాల్ లోకి అనుమతించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చివరకు మాల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది.
రైతు సంఘాల నుంచి నిరసనలు రావడం, ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో అధికారులు మాల్ పై చర్యలు తీసుకున్నారు. రైతుకు ఎంట్రీ నిరాకరించిన మాల్ యజమాని, సెక్యూరిటీ గార్డుపై కేసు నమోదైంది. పోలీసులు చర్యలు తీసుకోకుండా ఆందోళకు దిగుతామని రైతు నాయకులు హెచ్చరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి, తాత్కాలికంగా మాల్ ను మూసేశారు. వారం రోజుల పాటు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com