Flights Cancelled : సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు

ఎయిర్ ఇండియాకు చెందిన 70కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఒక విభాగంలోని సిబ్బంది అంతా ఉన్నట్టుండి సిక్ లీవ్ పెట్టారని, దీంతో నిన్న రాత్రి నుంచి నేటి ఉదయం వరకు పలు విమానాలు రద్దయినట్లు సంస్థ తెలిపింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంటూ ప్రయాణికులను క్షమాపణలు కోరింది. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకి వచ్చే ముందు తమ ఫ్లైట్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచించింది.
క్యాబిన్ సిబ్బందికి చెందిన కొంత మంది ఉద్యోగులు చివరి నిమిషంలో సిక్ లీవ్ తీసుకున్నారని, గత రాత్రి నుంచి విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. మానల రద్దు వల్ల ఇబ్బందులు పడిన వారికి రిఫండ్ ఇస్తున్నామని పేర్కొనింది. లేదంటే జర్నీ రీషెడ్యూల్ చేయడం జరుగుతుందని ఎయిర్ ఇండియా వెల్లడించింది.
అయితే, గతంలో వైపు టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌లైన్ మేనేజ్‌మెంట్ తో క్యాబిన్ క్రూ సభ్యుల మధ్య వివాదాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించినందుకు డిసెంబర్ 2023లో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com