Murder : బిహార్ మాజీ మంత్రి తండ్రి దారుణ హత్య

Murder : బిహార్ మాజీ మంత్రి తండ్రి దారుణ హత్య
X

బిహార్ మాజీ మంత్రి, వికాశీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్​ ముఖేష్ సహానీ తండ్రి జితన్ సహానీ దారుణ హత్యకు గురయ్యారు. బిహార్‌లోని దర్భంగా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జితన్‌ సహానీ దర్భంగాలోని సుపాల్‌ బజార్‌లోని ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కత్తులతో పొడిచి చంపారు. మంగళవారం ఉదయం మంచంపై ఆయన డెడ్ బాడీని చూసిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. జితన్ సహానీ కడుపు, ఛాతీపై అనేక కత్తిపోట్లు, గాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఘటన జరిగిన సమయంలో ముఖేశ్​ముంబయిలో ఉన్నారు. తన తండ్రి హత్య గురించి తెలియడంతో ఆయన వెంటనే ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ స్పందించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి తొందరగా విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags

Next Story