Former Governor : మాజీ గవర్నర్ తమిళిసైకి పితృవియోగం

Former Governor : మాజీ గవర్నర్ తమిళిసైకి పితృవియోగం
X

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి, తమిళనాడు కాంగ్రెస్‌లో సీనియర్ లీడరైన కుమారి అనంతన్(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో ఈరోజు పరిస్థితి విషమించి మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

తమిళిసై తండ్రి అనంతన్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. 1977లో నాగర్ కోయిల్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తమిళ రచయితగా, గొప్ప వక్తగా ఆయనకు ఎంతో పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. 1933లో కన్నియాకుమారి జిల్లా కుమారిమంగళంలో ఆయన జన్మించారు. తన తండ్రి కారణంగా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు.

Tags

Next Story