Jharkhand : ఉపఎన్నిక బరిలో ఝార్ఖండ్ మాజీ సీఎం భార్య

ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ భార్య కల్పన సొరెన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు ఝార్ఖండ్ ముక్తి మోర్చా ప్రకటన విడుదల చేసింది. ఆమె గాండేయ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉపఎన్నికలో పోటీ చేస్తారని పేర్కొంది. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామాతో గతేడాది డిసెంబర్ నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది.
దీంతో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ అసెంబ్లీ స్థానానికి మే 20న ఉప ఎన్నిక జరగనుండటంతో జేఎంఎం ఈ నిర్ణయం తీసుకుంది. జంషెడ్‌పుర్ నుంచి జేఎంఎం తరఫున లోక్‌సభ అభ్యర్థిగా బహర్‌గోరా సిట్టింగ్ ఎమ్మెల్యే సమీర్ మహంతీని బరిలో దించింది. ప్రస్తుతం గృహిణిగా ఉన్న కల్పనా ఎంటెక్, ఎంబీఏ చదువుకున్నారు.
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సొరేన్ అరెస్టయిన విషయం తెలిసిందే.గతంలో సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసులో జనవరి 31న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో కల్పనా సోరెన్ తదుపరి సీఎం అవుతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చినప్పటికీ పలు కారణాల వల్ల సాధ్యంకాలేదు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com