Former Karnataka CM : కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ కన్నుమూత
కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ(92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా కొనసాగిన ఎస్‌ఎం కృష్ణ వివిధ కీలక పదవులు నిర్వహించారు. 1999-2004 మధ్య కర్ణాటక సీఎంగా ఆయన పనిచేశారు. ఆ సమయంలో బెంగళూరులో ఐటీ రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత 2004 డిసెంబర్ నుంచి 2008 మార్చి వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం యూపీఏ హయాంలో 2009- 2012 మధ్య విదేశాంగ మంత్రిగా ఎస్‌ఎం కృష్ణ పనిచేశారు.దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్‌ఎం కృష్ణ.. 2017లో భాజపాలో చేరారు. గతేడాది రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. 2023లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com