చిక్కుల్లో యడియూరప్ప.. లైంగిక వేధింపుల కేసు నమోదు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై సంచలన కేసు నమోదైంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై యడియూరప్పపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అతనిపై పోక్సో చట్టం, IPC 354(A) కింద పోలీసులు అభియోగాలు మోపారు.
పదిహేడేళ్ల బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యడియూరప్పపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తల్లి, కుమార్తె యడ్యూరప్పను కలిసినప్పుడు ఫిబ్రవరి 2న ఈ సంఘటన జరిగింది. యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా అనేకసార్లు పనిచేశారు.
యడియూరప్ప 2008 - 2011 మధ్య, కొంతకాలం మే 2018లో, మళ్లీ జూలై 2019 నుండి 2021 వరకు కర్ణాటక సీఎంగా పని చేశారు. 2021లో అతని రాజీనామా కొన్ని వారాల పాటు ఊహాగానాలు, అనిశ్చితి తర్వాత వచ్చింది. తన నిర్ణయాన్ని ప్రకటిస్తూనే, యడ్యూరప్ప వేదికపై ఉండి.. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందని అన్నారు. బిఎస్ యడియూరప్ప తర్వాత బిజెపికి చెందిన బసవరాజ్ సోమప్ప బొమ్మై కర్ణాటక 23వ ముఖ్యమంత్రి అయ్యారు. బొమ్మై జూలై 2021 నుండి మే 2023 వరకు పనిచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు హవేరి నియోజకవర్గం నుండి బొమ్మైని బిజెపి అభ్యర్థిగా ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com