BJP : బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ సీఎం

BJP : బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ సీఎం

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మ‌హారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చ‌వాన్ బీజేపీలో చేరారు. ముంబైలోని బీజేపీ కార్యాల‌యంలో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చవాన్‌ను ఫడ్నవిస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం క‌లిగిన చ‌వాన్ బీజేపీలో చేర‌డం హ‌ర్షణీయ‌మ‌ని ఫడ్నవిస్‌ అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోన్ చేశారా అని మీడియా ప్రశ్నించగా సమాధానం చెప్పడానికి దాట వేశారు. బీజేపీలో చేరడం మాత్రం సంతోషంగా ఉందని వెల్లడించారు. చవాన్‌ 2014-2019లో రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు.

అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేతో ఉన్న విభేదాలే ఆయన రాజీనామాకు దారితీసి ఉండొచ్చని వార్తలు వచ్చాయి. అశోక్ చవాన్‌ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అమిత్ దేశ్ ముఖ్, ధీరజ్ దేశ్ ముఖ్, జితేష్, కునాల్ పాటిల్, సంగ్రామ్, మాధవ రావు, విశ్వజిత్ బీజేపీలో చేరతారని సమాచారం

Tags

Next Story