Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర నుంచి పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ పోటీ

Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర నుంచి పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ పోటీ

కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ 'గ్రాండ్ ఓల్డ్ పార్టీ'కి రాజీనామా చేసిన తర్వాత మార్చి 25న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. "నేను కురుక్షేత్ర నుండి పోటీ చేయబోతున్నారు. పార్లమెంటులో10 సంవత్సరాలు ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించాను. కాంగ్రెస్ నాయకత్వానికి, అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ధన్యవాదాలు. ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను" అని ఆయన తన పోస్టులో తెలిపారు.

2004-14 మధ్య కాంగ్రెస్ ఎంపీగా కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన జిందాల్, ప్రధాని నరేంద్ర మోదీ 'విక్షిత్ భారత్' ఎజెండాకు సహకరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

కాగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. 2014లో కురుక్షేత్ర నుంచి ఓడిపోయిన జిందాల్.. గత 10 ఏళ్లలో మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోందని, ఆర్టికల్ 370 రద్దు వంటి ఎన్నో చారిత్రాత్మక చర్యలు చేపట్టామని అన్నారు. అయోధ్యలో రామ మందిరం కల సాకారమైందని ఆయన విలేకరులతో అన్నారు.

నవీన్ జిందాల్‌తో పాటు, హర్యానా నుండి స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ చౌతాలా కూడా బీజేపీలో చేరారు. హిసార్ లోక్‌సభ స్థానాల నుండి పార్టీ అభ్యర్థిగా పేరు పెట్టారు. 78 ఏళ్ల చౌతాలా బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అతను మాజీ ఉప ప్రధాని దేవి లాల్ కుమారుడు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ చీఫ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా సోదరుడు.

Tags

Read MoreRead Less
Next Story