PM Kisan Scheme : నేడు రైతుల అకౌంట్లలోకి డబ్బులు

ప్రధాని మోదీ ( Narendra Modi ) నేడు 17వ విడత పీఎం కిసాన్ ( PM Kisan ) నిధులను విడుదల చేయనున్నారు. వారణాసిలో పర్యటించనున్న ఆయన 9.26 కోట్ల మంది రైతుల అకౌంట్లలో రూ.20 వేల కోట్లు జమ చేయనున్నారు. దీంతో పాటు 30వేలకు పైగా స్వయం సహాయక బృందాలకు మోదీ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. కాగా రైతులకు కేంద్రం ఏటా మూడు విడతల్లో రూ.6వేలు నగదు సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే.
'మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. గత హయాంలో కూడా రైతుల ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడోసారి ప్రధాని అయ్యక.. మొదటి సంతకం పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన దస్త్రంపైనే చేశారు. ' అని తెలిపారు చౌహాన్.
ఈ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 3.04 లక్షల కోట్లను అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 17వ విడత కింద 9.3 కోట్ల మంది అర్హులైన వారి కోసం రూ. 20 వేల కోట్ల మేర విడుదల చేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com