Gautam Gambir : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: గంభీర్

తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ ఎంపీ, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తెలిపారు. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ట్యాగ్ చేస్తూ ఆయన ఎక్స్ ట్వీట్ చేశారు. 'క్రికెట్ పైల పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకే రాజకీయాలకు దూరమవుతున్నా. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన మోదీ (Modi), అమిత్ షాకు (Amit Shah) కృతజ్ఞతలు' అని ఆయన పేర్కొన్నారు. కాగా గంభీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ ఎంపీగా కొనసాగుతున్నారు.
గౌతమ్ గంభీర్ 2019 మార్చి 22న భారతీయ జనతా పార్టీలో చేరి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా తూర్పు ఢిల్లీ (Delhi) నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీపై 3,90,391 ఓట్ల మెజారిటీతో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com