Gold Prices : ఏడాది తొలిరోజే పసిడి ప్రియులకు షాక్

Gold Prices : ఏడాది తొలిరోజే పసిడి ప్రియులకు షాక్
X

ఈ ఏడాది బంగారం ధరలు మరింత ఎగబాకొచ్చనే మార్కెట్ నిపుణుల అంచనాలకు అనుగుణంగా ఇవాళ రేట్లు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగి రూ.78వేలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేట్ రూ.400 పెరిగి రూ.71,500గా నమోదైంది. అటు కేజీ సిల్వర్ రేట్ రూ.98వేలుగా కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి. బంగారం ధరలు డాలర్ విలువ ఆధారంగా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ప్రస్తుతం డాలర్ విలువ భారీగా పెరిగింది. ఒక డాలర్ విలువ 85 రూపాయలకు పైగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలు భారీగా తగ్గుతాయి.

Tags

Next Story