Good News : సరోగసీ పొందే మహిళా ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే మహిళలతో పాటు ఆ పిల్లల తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరోగసీ విషయంలో 50 ఏళ్ల నాటి నిబంధనల్ని కేంద్రం సవరించింది.
ఇకపై సరోగసీ ద్వారా తల్లి అయిన మహిళకు 180 రోజుల ప్రసూతి సెలవులు అందనున్నాయి. తండ్రులు కూడా 15 రోజులపాటూ పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. అద్దె గర్భం ద్వారా బిడ్డలను పొందే తల్లిదండ్రులకు సెలవుల హక్కు కల్పిస్తూ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్-1972ను సవరించింది. సవరించిన కొత్త రూల్స్ జూన్ 18 నుంచి అమల్లోకి వచ్చాయి.
కొత్త నిబంధనల ప్రకారం అద్దె గర్భం ధరించేవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే 180 రోజుల ప్రసూతి సెలవులు పొందుతారు. అలాగే ఇద్దరి కంటే తక్కువ పిల్లలున్న ప్రభుత్వ ఉద్యోగి తల్లికి కూడా ఈ సెలవులు లభిస్తాయి. ఈ సవరించిన సరోగసీ కేసుల్లో పితృత్వ సెలవులను కూడా చేర్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com