Goods Rail : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Goods Rail : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఖమ్మం విజయవాడ మార్గంలోని చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 113వ గేటును సమీపించగానే భారీ శబ్దాలు రావడంతో లోకోపైలట్ రైలును నిలిపివేశాడు. అనంతరం బయటకు వచ్చి చూడగా రెండు బోగీలు పట్టాలు తప్పి ఉన్నాయి. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని రైల్వే సిబ్బంది తెలిపారు. వెంటనే ఆ ప్రాంతంలో పునరుద్ధరణ పనులు చేపట్టామని, అవి పూర్తయ్యేవరకు కాజీపేట నుంచి విజయవాడ వెళ్లే రైళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ తాత్వాలిక మరమ్మతులు చేస్తున్నామని, గూడ్స్ రైలును తిరిగి పట్టాలు ఎక్కించామని అధికారులు వెల్లడించారు. తాత్కాలిక మరమ్మతులు పూర్తయిన వెంటనే ఈ మార్గాన్ని తిరిగి ప్రారంభిస్తామని, తర్వాత ఇక్కడ పూర్తిస్థాయి మరమ్మతులు చేస్తామని అధికారులు తెలిపారు.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీలోని చారమండి జకీరా ఫ్లైఓవర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని, సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ట్రాక్‌ల నుంచి వ్యాగన్‌లు పట్టాలు తప్పిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎనిమిది బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. మధ్యాహ్నం 11.50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ముంబై నుంచి చండీఘ‌డ్ వెళ్తున్న ఆ గూడ్స్ రైలులో ఐర‌న్ షీట్ రోల్స్ ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story