NASA : జూన్ 30న జీఎస్ఎల్వీ -ఎఫ్ 16 ప్రయోగం

NASA : జూన్ 30న జీఎస్ఎల్వీ -ఎఫ్ 16 ప్రయోగం
X

శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 30వ తేదీన చేపట్టనున్న జీఎస్ఎల్వీ-ఎఫ్ 16 ప్రయోగానికి శాస్త్రవేత్తలు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. షార్లోని రెండవ ప్రయోగవేదికపై నింగికెక్కుపెట్టిన బాణంలా ఉన్న జీఎస్ఎల్పీ -ఎఫ్16 రాకెట్కు సంబంధించిన రిహార్సల్ను ఆదివారం శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. సోమవారం ఈ నివేదికలను ఎంఆర్ఆర్ (మిషన్ రెడినెస్ రివ్యూ) సమావేశాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు జీఎస్ఎల్వీ -ఎఫ్ 16 ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రారంభించనున్నారు. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు 0కు చేరుకోగానే నిప్పులు చిమ్మూతూ నింగిలోకి జీఎస్ఎల్వీ -ఎప్16 దూసుకెళ్లనుంది. జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ద్వారా నాశాకు చెందిన నిసార్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. నిసార్ ఉపగ్రహం పూర్తిగా వాతావరణ సమాచారం కోసం చేస్తున్న ప్రయోగం 2392 కిలోల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహం ఐదు ఏళ్ళ పాటు అంతరిక్షం నుండి సేవలు అందించనున్నది. ఈ నిసార్ ఉపగ్రహం ద్వారా విలువైన వాతావరణ సమాచారం అందుతుంది. నిసార్ ఉపగ్రహం ప్రయోగం అనంతరం ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని చుడుతూ పరిశీలించిన సమాచారాన్ని ఇస్రో కేంద్రానికి అందిస్తుంది. ఈ ఉపగ్రహం స్పష్టమైన త్రీడి చిత్రాలను అందిస్తుంది. నిసార్ ఉపగ్రహము ప్రకృతి విపత్తులను ముందుగానే తెలియజేస్తుంది. భూకంపాలు, వరదలు, అగ్ని పర్వతాల విస్ఫోటనలు, సునామి వంటి విపత్కర ప్రమాదాల సమాచారాన్ని ముందుగానే అందిస్తుంది. మంచు పర్వతాల కదలికలు, కొండా చర్యలు కదలికలను కూడా నిసార్ ఉపగ్రహం ద్వారా గుర్తించవచ్చు. నిసార్ ఉపగ్రహం నిఘా ఉపగ్రహంగా కూడా ఉపయోగపడుతుంది. భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య సమకాలిక కక్ష్యలో ఈ నిసార్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. మూడు దశల్లో ఈ ప్రయోగాన్ని పూర్తిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్ఎల్వీ మార్క్ 2 సిరిస్లో 18వ ప్రయోగం కాగా షార్ కేంద్రం నుంచి 102వ ప్రయోగం కావడం విశేషం. ఈ ఏడాది రెండు రాకెట్ ప్రయోగాలు విఫలం ఐన తరువాత జరుగుతున్నా ఈ రాకెట్ ప్రయోగం విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదటి సారిగా నాసాతో సంయుక్తంగా ఇస్రో రాకెట్ ప్రయోగం చేపట్టనుంది.

Tags

Next Story