Haryana CM : సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా

హర్యానాలో (Haryana) రాజకీయ గందరగోళం మధ్య, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar).. గవర్నర్ బండారు దత్తాత్రేయకు తన రాజీనామాను సమర్పించారు. జననాయక్ జనతా పార్టీతో బంధం తెగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వంలో కొన్ని పెద్ద మార్పులకు బీజేపీ నాయకత్వం వెళ్లే అవకాశం ఉందని సమాచారం. బీజేపీ శాసనసభా పక్షం ఈ రోజు సమావేశం కావచ్చని వారు తెలిపారు. పలు నివేదికల ప్రకారం, అతని స్థానంలో జాట్‌యేతరుడైన నయాబ్ సింగ్ (Nayaab Singh) సైనీని నియమించనున్నారు.
కర్నాల్ నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ పోటీ చేయవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ మార్పులను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి అర్జున్ ముండా, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ సహా కేంద్ర బీజేపీ నేతలు రాష్ట్రంలో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీ సీనియర్ నేతలు నోరు మెదపకపోవడంతో మార్పు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో సీట్ల భాగస్వామ్య ఒప్పందం కుదరకపోవడంతో బీజేపీ, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com