ప్రియాంక గాంధీకి అనారోగ్యం.. హెల్త్ బులెటిన్ ఇదే

ప్రియాంక గాంధీకి అనారోగ్యం.. హెల్త్ బులెటిన్ ఇదే

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ ఆశాకిరణం ప్రియాంక గాంధీ వాద్రా అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఆమె హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. అనారోగ్యం విషయం తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రియాంక గాంధీ.

శుక్రవారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొనాల్సి ఉంది. ఐతే.. అనారోగ్య కారణాలతో ఆమె యాత్రలో పాల్గొనలేదు. .. అందులో ఆమె చేరడం లేదు. కోలుకున్న వెంటనే భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటానని తెలిపారు. జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్ చేరుకుంటోందని.. ఈ యాత్రలో పాల్గొనాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రియాంక తెలిపారు.

అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరాల్సి వస్తుందని ఊహించలేదన్న ప్రియాంక.. పార్టీ కార్యకర్తలు తమ ఉత్సాహాన్ని కొనసాగించాలని అభ్యర్థించారు. యూపీ యాత్రలో అతి త్వరలో పాల్గొంటాననీ.. చందౌలీ-బనారస్ చేరుకునే యాత్రికులకు, నా సహచరులకు, ఉత్తరప్రదేశ్ నుంచి ప్రయాణానికి శ్రద్ధగా సిద్ధమవుతున్న ప్రియమైన సోదరుడు రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు.. అని పోస్ట్ పెట్టారు ప్రియాంక. భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం బిహార్ మీదుగా సాగుతోంది. శుక్రవారం సాయంత్రం నుంచి యూపీలో కొనసాగుతుంది.

Tags

Next Story