Liquor Scam Case : లిక్కర్ స్కామ్‌ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌పై విచారణ

Liquor Scam Case : లిక్కర్ స్కామ్‌ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌పై విచారణ
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఏడో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. కవితతో సహా ఐదుగురు నిందితులపై ఛార్జ్‌షీటును పరిగణనలోకి తీసుకునే అంశంపై తుది ఉత్తర్వులను ఈ నెల 29న వెలువరించనున్నట్లు న్యాయమూర్తి కావేరీ బవేజా తెలిపారు. మరోవైపు 28న కేజ్రీవాల్‌పై దాఖలైన సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌పై వాదనలు ప్రారంభం కానున్నాయి.

ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, సెక్షన్ 45, 44(1) ప్రకారం ఈ అనుబంధ చార్జ్ షీట్ డాక్యుమెంట్స్​ను ట్రంకు పెట్టలో కోర్టుకు సమర్పించింది. ఎమ్మెల్సీ కవిత, ఆప్ తరఫున గోవాలో ప్రచారం నిర్వహించిన ముగ్గురు ఉద్యోగులు (చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్) దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చరణ్ ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ చానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ లను తాజా చార్జ్​షీట్ లో నిందితులుగా పేర్కొంది. ఈ చార్జ్​షీట్ ను పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై మంగళవారం ఈడీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ కే మట్ట వాదనలు కొనసాగించారు.

Tags

Next Story