Heatwave Alert : ఈ రాష్ట్రాల్లో ఎండల మంటలు తప్పవు: వాతావరణ శాఖ

వర్షాలకు ముందుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పుడు పర్వాలేదనే చెప్పాలి. కానీ ఉత్తర భారత్‌లోని పంజాబ్, హరియాణా, ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, గుజరాత్, ఎంపీ రాష్ట్రాల్లో ఎండల మంటలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ రాష్ట్రాల ప్రజలతో పాటు అక్కడికి ప్రయాణించేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈరోజు సైతం ఆయా రాష్ట్రాల్లో 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది.
అల్పపీడన ప్రభావంతో ఏపీలో రేపు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది.
మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల కిందటి వరకు రాష్ట్రంలో 40 డిగ్రీలలోపే టెంపరేచర్లు నమోదుకాగా.. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 43.9 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com