Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్

X
By - Manikanta |6 April 2024 11:08 AM IST
తెలంగాణ (Telangana)-ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సరిహద్దుల్లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా కర్రిగుట్టలు, ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలంలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 4 రోజుల క్రితం బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో ఏకే-47తోపాటు మూడు తుపాకులు, పేలుడు పదార్థాలు లభించాయని చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com