Rain Alert : కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు

Rain Alert : కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు

రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం జిల్లాలో 582 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. కంజిరపల్లి, వైకోమ్, చంగనస్సెరీ డివిజన్లలో 33 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. కొట్టాయం(D)లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. పథనంతిట్ట, అలప్పుళ, ఇడుక్కి, వయనాడ్ జిల్లాల్లో ఈదురుగాలులతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.

ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, NTR, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, YSR, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది. మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది.

ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం 10 గంటల వరకు భూపాలపల్లి, గద్వాల్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు 40Kmph వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

Tags

Next Story